సెక్స్ రాకెట్లో సిమ్రాన్ అరెస్టు...!
పోలీసులు.. తాజాగా కొండాపూర్‌లో కొనసాగుతున్న వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. మహిళా నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) గత కొంత కాలంగా కొండాపూర్ సమీపంలోని శ్రీరాంనగర్‌లో ఓ ఫ్లాట్‌ని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. సాయిప్రతాప్ అపార్ట్‌మెంట్‌లో కొనసాగుతున్న వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మహిళ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని వివిధ రాష్ట్రాల నుండి అందమైన అమ్మాయిలను తీసుకునివచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తోందని వారు పోలీసులకు చెప్పారు. రోజూ ఆ ప్రాంతానికి కొత్తకొత్త వాళ్లు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో అందర్నీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు, రూ. 6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి