ఆమె నలభై ఏళ్ల టీచర్... అతను 15 ఏళ్ల స్టూడెంట్... ఇదేం పాడుబుద్ధి ?
ఆమె ట్యూషన్‌లో పాఠాలు చెప్పే పంతులమ్మ. వయసు 40 సంవత్సరాలు. అతను ట్యూషన్‌కొచ్చిన స్టూడెంట్. వయసు 15 సంవత్సరాలు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసముండే వారిద్దరూ ఇంట్లో వాళ్ల కళ్లుగప్పి పారిపోయారు. బైక్‌పై 2వేల 2వందల కిలోమీటర్లు 3 రాష్ట్రాలను కవర్ చేస్తూ జోరుగాహుషారుగా షికారు చేశారు. చివరకు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్‌లోని రామోల్ ప్రాంతానికి చెందిన మనీషా జోషి ట్యూటర్‌గా పాఠాలు చెబుతోంది. ఆమె ట్యూషన్‌కు వచ్చిన పదో తరగతి చదివే 15 ఏళ్ల కుర్రాడిపై ఆమె మనసుపడింది. టీనేజ్ వయసులో ఉన్న ఆ కుర్రాడు ఆమె వ్యామోహంలో పడ్డాడు.
ఇద్దరూ కలిసి ప్రేమ పక్షుల్లా ఎగిరిపోవాలని నిర్ణయించుకున్నారు. బైక్‌పై దాదాపు 2వేల 2వందల కిలోమీటర్లు ప్రయాణించారు. దారి మధ్యలో హోటల్స్‌లో రూమ్ తీసుకుని ఏకాంతంగా గడిపారు. వీరికి ఆ కుర్రాడి స్నేహితుడు గురుశిఖర్ ఆర్థికంగా సహాయం చేశాడు. చివరికి ఆ కుర్రాడి సాయంతోనే పోలీసులు కేసును డీల్ చేశారు. పక్కా స్కెచ్‌తో ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. మనీషాపై పోలీసులు ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ కింద కేసు నమోదు చేశారు. బాలుడి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి అతనిని పంపించారు. విద్యార్థిని కొడుకుగా భావించాల్సిన టీచర్... క్షణిక సుఖాల కోసం వెంపర్లాడిన నాలుగు గోడల మధ్య ముద్దాయిగా నిలబడి ఊచలు లెక్కపెడుతోంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి