బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న గ్లామర్ బ్యూటీ రమ్యకృష్ణ ఆ తర్వాత ‘సొగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో తన అందమైన హవాభావాలు, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో కట్టిపడేసింది. ఈ రెండు సినిమాలు రమ్యకృష్ణకు కొత్త ఇన్నింగ్స్ గా బాగానే ఉపయోగపడ్డాయి.
ఈ రెండు చిత్రాల తర్వాత రమ్యకృష్ణకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటివరకు అత్తమ్మ, అమ్మ వంటి పాత్రలలో నటించిన రమ్యకృష్ణ త్వరలోనే ఓ మిడిల్ ఏజ్ ఆంటీ పాత్రలో కనిపించనుందని తెలిసింది. ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో రమ్యకృష్ణ టీనేజ్ కుర్రాడితో ఎఫైర్ పెట్టుకున్న పాత్రలో నటిస్తోందని అక్కడి సినీ ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు వేచిచూడాల్సిందే.
ఇక రమ్యకృష్ణ తమిళంలో టీవి ఛానెల్లోని సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా వుంది. మొత్తానికి రమ్యకృష్ణ ఈ వయసులో కూడా తన హుషారును ఏమాత్రం తగ్గించకుండా దూసుకుపోతుంది


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Top