బెంగళూరు: ప్రపంచంలోనే అతి  చవకైనా స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామంటూ నమోటెల్‌ డాట్‌కామ్‌ సంచలన ప్రకటన చేసింది. 99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ  మొబైల్ ప్రియుల  గుండెల్లో  గుబులు పుట్టించింది.  అరుదైన రీతిలో 99 రూపాయలకే  అచ్చేదిన్ పేరిట స్మార్ట్‌ఫోన్‌ను పంపిణీ చేస్తామని బెంగళూరులో ప్రకటించింది. నగరంలో మంగళవారం నమోటెల్‌ కంపెనీ సీఈఓ మాధవరెడ్డి మీడియాకు ఈ వివరాలు ప్రకటించారు. మే 17న ప్రారంభమైన  బుకింగ్ లు మే 25 తో ముగుస్తాయని వెల్లడించారు.
తమ స్మార్ట్‌ఫోన్‌  కొనాలనుకునే వారు నమోటెల్. డాట్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడి, పాస్‌వర్డ్‌ను పొందాలన్నారు. ఇందులో లాగిన్ అయ్యాక ఆన్‌లైన్ రూపంలో నగదు చెల్లించాలి. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడి అందుతుంది. వాటి ఆధారంగా నమోటెల్‌ డాట్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్  చేసుకుని ఫోటో, ఆధార్‌కార్డును జతచేస్తే స్మార్ట్‌ఫోన్‌ ను అందిస్తామన్నారు. బి మై బ్యాంకర్‌లో సభ్యుడిగా చేరితే మాత్రమే నోవాటెల్‌లో రిజిస్ట్రేషన్ సాధ్యమన్నారు. బ్లాక్ అండ్ వైట్ రెండు రంగుల్లో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్  ధరను  2వేల  రూపాయలను తగ్గించినట్టు  ప్రకటించింది.   కంపెనీ క్యాష్ ఆన్ డెలీవరీ సదుపాయం కూడా కల్పించినట్టు రెడ్డి  చెప్పారు.

దీని ఫీచర్స్  ఇలా ఉన్నాయి.
1.3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
1 జీబీ రామ్ , 3జీ
4 జీబీ రామ్
3 మెగా పిక్సెల్ ఫ్రంట్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
డ్యూయల్ సిమ్, 4 ఇంచ్ హెచ్ డీ డిస్ ప్లే
1325 ఎంఏహెచ్ బ్యాటరీ

2 కామెంట్‌లు:

 
Top